కలిశెట్టి ఎల్లో మార్చ్ – మహానాడు వేదికగా స్త్రీ శక్తి సందేశం
సహనం వందే, రణస్థలం: తెలుగుదేశం పార్టీ వార్షిక వేడుక మహానాడు అరుదైన దృశ్యాలకు వేదికైంది. కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా సంప్రదాయాలు, ఆధునికత మేళవించిన హైబ్రిడ్ విధానంతో పార్టీ సరికొత్త ఒరవడిని సృష్టించింది. కార్యకర్తలను పార్టీకి వెన్నెముకగా భావించే టీడీపీ ఈసారి మహిళా సాధికారతను అజెండాగా మార్చుకుని రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. సంప్రదాయం, ఆధునికత కలయికవిజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తనదైన శైలిలో ఈ మహానాడును ప్రారంభించారు. తన మాతృమూర్తి కలిశెట్టి సూరప్పమ్మ…